రాతనలో ఘనంగా ఏరువాక పౌర్ణమి, ఎద్దుల పోటీల్లో విజేతలకు సన్మానం

2062చూసినవారు
రాతనలో ఘనంగా ఏరువాక పౌర్ణమి, ఎద్దుల పోటీల్లో విజేతలకు సన్మానం
కర్నూలు జిల్లా, పత్తికొండ సమీపంలోని తుగ్గలి మండలం రాతన గ్రామంలో శనివారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఎద్దుల కర తెంచడం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ పోటీల్లో పాల్గొన్న ఎద్దుల రైతు యజమానులను వాల్మీకి సంఘం జాతీయ కార్యదర్శి ఆస్పరి శ్రీనివాసులు నాయుడు సన్మానించి, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, కురువ పక్కన రామాంజనేయులు, ముద్దు తిమ్మప్పతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్