శుక్రవారం కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద, సిపిఎం పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశారు. ప్రజానాట్యమండలి నాయకులు పి.కాశన్న అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో, సిపిఎం మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు దస్తగిరి, సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి నరసన్న, రైస్ సంఘం నాయకులు రాజుల కారప్ప మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని వీడాలని, 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ఉపాధి చట్టాన్ని కొనసాగించాలనే డిమాండ్ తో ఈ ప్రతిజ్ఞ జరిగింది.