నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం రాత్రి కోటి దీపోత్సవం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆలయ ఏవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వేదం పండితులు, అర్చకులు భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి భక్తులచే ఈ కోటి దీపోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో సాగింది.