నంద్యాల–గిద్దలూరు రహదారిలోని నల్లమల ఘాట్ రోడ్డులో బొలెరో వాహనం బోల్తా పడింది. గాజులపల్లికి చెందిన కూలీలు గిద్దలూరుకు వెళ్తుండగా ఎస్-టర్నింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని 108 వాహనాల్లో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.