శ్రీశైలంలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు అల్పాహారం కూడా అందించారు.