కృష్ణా పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు నిరంతరంగా చేరుతోంది. మంగళవారం ఇన్ ఫ్లో 43, 631 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 40, 276 క్యూసెక్కులుగా నమోదైంది. కుడి, ఎడమగట్టు భూగర్భ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయ నీటిమట్టం 883. 70 అడుగులు, నీటి నిల్వ 208. 2841 టీఎంసీలుగా ఉంది.