శ్రీశైలం టోల్ గేట్ వద్ద మంగళవారం వాహన తనిఖీల్లో కారులో తుపాకీ బయటపడటంతో కలకలం రేగింది. డాష్‌బోర్డ్ కింద దాచిన ఆయుధాన్ని సెక్యూరిటీ, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన పోలీస్ అధికారి దర్శనార్థం వచ్చారని ప్రాథమిక విచారణలో తేలింది. అయితే, ఆయుధం ఎలా చేరింది, అనుమతులు ఉన్నాయా అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.