శ్రీశైలంలో కార్తీక పౌర్ణమి రద్దీ

167చూసినవారు
ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. 'హరహర మహాదేవ.. శంభోశంకర' అంటూ మల్లన్న సన్నిధి మారుమోగింది. వివిధ రాష్ట్రాల భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయం వద్ద కార్తీక దీపాలను వెలిగించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత పాతాళగంగలో స్నానాలు ఆచరించిన భక్తులు, శివనామస్మరణతో ఆలయ పరిసరాలను నింపేశారు.