శుక్రవారం ఉదయం మహానంది పుణ్యక్షేత్ర పరిసర ప్రాంతాలు దట్టమైన పొగమంచుతో కనువిందు చేశాయి. నల్లమల అడవిలో ఉదయం 8 గంటల వరకు మంచు తెరలు వీడకపోవడంతో, క్షేత్రానికి వచ్చిన భక్తులు ఈ అద్భుత దృశ్యాలను వీక్షించి పరవశించారు. పొగమంచు కారణంగా రోడ్లు కనిపించక వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది.