మహానంది: బాధితులకు అండగా ఎంపీపీ యశస్విని

1చూసినవారు
మహానంది: బాధితులకు అండగా ఎంపీపీ యశస్విని
మహానంది మండలం తిమ్మాపురం, అబ్బీపురం గ్రామాల్లో శనివారం వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఎంపీపీ బుడ్డారెడ్డి యశస్విని అధికారులతో కలిసి ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. తిమ్మాపురం ఎస్సీ కాలనీలో ఇళ్లు ధ్వంసమైన బాధితులకు రూ. 5000 ఆర్థిక సహాయం అందజేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ సమస్యలపై వెంటనే ఏఈకి సూచనలు చేశారు. పలు నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్