మహానంది మండలం గాజులపల్లెలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో వర్షం కురిసింది. వరి, మొక్కజొన్న పంటల దిగుబడిని కల్లాల్లో, రోడ్ల వెంబడి ఆరబెట్టుకున్న రైతులు టార్పాలిన్ పట్టాలు కప్పుకొని కాపాడుకుంటున్నారు. అరటి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా వడగాడ్పులతో సతమతమవుతున్న ప్రజలకు వర్షం కాస్త ఊరటనిచ్చింది. వర్షం కురిసే వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.