పాణ్యంలో గంజాయి విక్రేతల అరెస్ట్ 2 కిలోల స్వాధీనం

2164చూసినవారు
పాణ్యం స్టీల్ ప్లాంట్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2 కిలోల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు, ఒక పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సునీల్ షారాణ్ ఆదేశాల మేరకు మాదకద్రవ్యాలపై కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తున్నట్లు సీఐ కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐ నరేంద్ర, పీఎస్ఐ ధనుంజయ పాల్గొన్నారు.