శ్రీశైలం: 23 అడుగులకు ఎత్తిన 10 గేట్లు

1439చూసినవారు
శ్రీశైలం: 23 అడుగులకు ఎత్తిన 10 గేట్లు
కృష్ణమ్మ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జూరాల, సుంకేసుల, హంద్రీ ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 6 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. దీంతో ఆదివారం డ్యాం 10 గేట్లను 23 అడుగులకు ఎత్తి సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. 2018 తర్వాత గేట్లను 23 అడుగులకు ఎత్తడం ఇదే తొలిసారి. ఒక గేటు ఎత్తు 55 అడుగులు, వెడల్పు 60 అడుగులు ఉంటుంది. సాధారణంగా గేట్లు ఎప్పుడు తెరిచి 10 అడుగులు ఎత్తి నీటి విడుదలను ప్రారంభిస్తారు.

సంబంధిత పోస్ట్