మహానందిలో భక్తుల సందడి...!

832చూసినవారు
పెళ్లి ముహూర్తానికి చివరి రోజు కావడంతో, గురువారం మహానంది ఆలయ ప్రాంగణంలో కొన్ని వివాహాలు జరిగాయి. నూతన వధూవరులతో పాటు వివాహాలకు వచ్చిన వారు శ్రీ కామేశ్వరి దేవి, శ్రీ మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మూడు రోజులుగా భక్తులు లేక బోసిపోయిన ఆలయ ప్రాంగణాలు గురువారం భక్తులతో కళకళలాడాయి. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్