శ్రీశైలం పాతాళగంగ మెట్ల మార్గంలోని సత్యనారాయణ శాస్త్రి ఇంటి ప్రాంగణంలోకి నిన్న అర్ధరాత్రి చిరుత ప్రవేశించింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. గత ఏడాది జనవరి 6న కూడా ఇదే ఇంటి ఆవరణలోకి చిరుత రావడం గమనార్హం. వరుస ఘటనలతో భక్తులు, స్థానికులు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని శాస్త్రి ప్రజలకు సూచించారు. అటవీ శాఖ అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.