వెలుగోడు మండలం వేల్పనూరుకు చెందిన టీడీపీ నాయకుడు సుబ్బరాయుడు అనారోగ్యంతో మరణించారు. ఆయన మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సుబ్బరాయుడు పార్థివ దేహానికి నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.