
ఎమ్మిగనూరులో ఈనెల 10న టెన్త్ అర్హతతో ఉద్యోగావకాశాలు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా జరగనుంది. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ మేళాలో 11 కంపెనీలు పాల్గొంటాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఫార్మసీ విద్యార్హతలు ఉండి, 18 నుండి 35 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. ఇంటర్వ్యూలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.






































