కర్నూలులో సీఎం పర్యటనకు 1200 మంది పోలీసులు

526చూసినవారు
కర్నూలులో సీఎం పర్యటనకు 1200 మంది పోలీసులు
ఫిబ్రవరి 6న ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో 1200 మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా బందోబస్తును ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్, సభ ప్రాంగణం, రూట్, ట్రాఫిక్, పార్కింగ్, బాంబ్ స్క్వాడ్ వంటి కీలక ప్రాంతాల్లో పూర్తి అప్రమత్తత పాటించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేతో పాటు ఇతర అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you