ఆముదాల శ్రీనివాస్ ఎమ్మిగనూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్.డి.పి.ఓ)గా నియమితులయ్యారు. ఇంతకుముందు గుంతకల్లు ఎల్.డి.పి.ఓగా పనిచేస్తున్న ఆయనను బదిలీ చేసి ఎమ్మిగనూరులో పోస్టింగ్ ఇచ్చారు. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సిఫారసుల మేరకు డీజీపీ శ్రీహరిష్ కుమార్ గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబరు 30న మంగళగిరిలో జరిగిన బోర్డు సమావేశంలో డీఎస్పీల సర్వీస్ వివరాలు, ఖాళీలను పరిశీలించి ఈ బదిలీలు, పోస్టింగులకు సిఫారసు చేశారు. ఈ మేరకు ఆముదాల శ్రీనివాసను గుంతకల్లు నుంచి ఎమ్మిగనూరు ఎస్.ఓ.పి.ఓగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.