విద్యాశాఖ అధికారి పై చర్యలు తీసుకోవాలి.. ఎస్ఎఫ్‌ఐ

420చూసినవారు
విద్యాశాఖ అధికారి పై చర్యలు తీసుకోవాలి.. ఎస్ఎఫ్‌ఐ
ఎమ్మిగనూరు మండల విద్యాశాఖ అధికారి (MEO-2) మధుసూదన్, ప్రభుత్వ పాఠశాలల్లో కల్చరల్ మరియు స్పోర్ట్స్ నిర్వహణ కోసం విడుదలైన నిధులలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఎస్ఎఫ్‌ఐ ఆరోపించింది. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్‌ఐI పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు డిప్యూటీ తహసీల్దార్ వీరేంద్ర గౌడ్ కుగురువారం  వినతిపత్రం అందించారు. ఎస్ఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి రాము, ఉపాధ్యక్షుడు దేవా మాట్లాడుతూ ఏప్రిల్ 3, 4 తేదీలలో నిర్వహించాల్సిన కార్యక్రమాల నిధులలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్