నందవరం తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఖాసీం వల్లి, సీఎం చంద్రబాబు నాయుడుపై వైసిపి నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, అంబటి రాంబాబు తన తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంబటి రాంబాబును కఠినంగా శిక్షించాలని, వైసిపి అధినేత జగన్ వెంటనే అంబటి రాంబాబును పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.