ఎమ్మిగనూరును జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని, పశ్చిమ కర్నూలు ఐదు నియోజకవర్గాల అభివృద్ధి కోసం విద్యార్థి, యువజన, ప్రజా సంఘాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశాయి. గురువారం వారు మాట్లాడుతూ, ఎమ్మిగనూరు జిల్లా కేంద్రం ఏర్పడితే ప్రజలకు విద్యా, వైద్యం, ఉపాధి, సాగునీటి సౌకర్యాలు మెరుగుపడతాయని, వలసలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఆదోని, పత్తికొండ, మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన ఇతర డిమాండ్లను కూడా పరిష్కరించాలని కోరారు.