ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో 9వ జాతీయ పోషణ్ మాసం వేడుకలు ఐసీడీఎస్ సూపర్వైజర్ కె. నీలమ్మ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహార ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయడమే పోషణ్ మాసం ప్రధాన ఉద్దేశమని సూపర్వైజర్ కె. నీలమ్మ తెలిపారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ప్రతిరోజూ పాలు, గుడ్లు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు వంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.