కార్మిక చట్టాల రద్దుపై ఆగ్రహం..ఏప్రిల్ 1న బ్లాక్ డేకు సంఘాల పిలుపు

263చూసినవారు
కార్మిక చట్టాల రద్దుపై ఆగ్రహం..ఏప్రిల్ 1న బ్లాక్ డేకు సంఘాల పిలుపు
బిజెపి ప్రభుత్వం 2019-2020లో కార్మిక వర్గం సాధించుకున్న 29 రకాల చట్టాలను రద్దు చేసి, నాలుగు కార్మిక వ్యతిరేక చట్టాలను తెచ్చిందని, దీనివల్ల కార్మిక వర్గం బానిసత్వం మాదిరిగా మారుతుందని కార్మిక సంఘాలు ఆరోపించాయి. దీనికి వ్యతిరేకంగా ఏప్రిల్ 1న బ్లాక్ డే పాటించాలని సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్టియు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఎమ్మిగనూరులోని సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఏ సురేష్ అధ్యక్షతన మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాకముందు నుంచే కార్మిక వర్గం అనేక హక్కులను సాధించుకుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్