ఎమ్మిగనూరులో అన్నదమ్ముల దొంగతనాలు.. గ్యాంగ్‌ అరెస్ట్‌

360చూసినవారు
ఎమ్మిగనూరులో అన్నదమ్ముల దొంగతనాలు.. గ్యాంగ్‌ అరెస్ట్‌
ఎమ్మిగనూరులో ఇటీవల జరిగిన బంగారు ఆభరణాలు, నగదు దొంగతనం కేసును పట్టణ పోలీసులు ఛేదించారు. ఆదివారం అన్నదమ్ములైన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకకు చెందిన శంకర్ నాయుడు, అతని తమ్ముడు కార్తీక్ బోవి బ్యాంకుల వద్ద మాటువేసి, నగదు, ఆభరణాలు తీసుకెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని, బాధితులను వెంబడించి, అవకాశాన్ని చూసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. మార్చి 16న తిప్పారెడ్డి దంపతులను లక్ష్యంగా చేసుకుని స్కూటీ డిక్కీ నుంచి 30 గ్రాముల బంగారం, రూ. 1.90 లక్షలు దోచుకున్నారని, సీసీటీవీ ఆధారాలతో నిందితులను అరెస్టు చేశారని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్