ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామానికి శుక్రవారం వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. గురువారం సీఎం సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించి, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటన నేపథ్యంలో బహిరంగ సభ, హెలిపాడ్, గ్రామసభ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.