గోనెగండ్ల ప్రభుత్వ ఆసుపత్రి స్థాయిని తగ్గించి, వైద్య సేవలను కుదించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్ల కార్డులు చేతబట్టి నిరసన చేపట్టారు. మండల కన్వీనర్ ఖాసీంవలి మాట్లాడుతూ, గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల పేద ప్రజలకు వైద్య సదుపాయాలు అందడం లేదని, కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆసుపత్రికి పూర్వవైభవం తీసుకురావాలని డిమాండ్ చేశారు.