ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని చేనేతల అస్తిత్వాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం వీవర్స్ కాలనీ గ్రౌండ్‌లో నిరసన వ్యక్తం చేశారు. పార్టీ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి, సీఎం నారా చంద్రబాబు నాయుడు పాలనపై విమర్శలు చేశారు. కోఆపరేటివ్ సొసైటీలను ఆప్కోలో విలీనం చేయడం చేనేతలపై ఘోర దాడి అని, ఈ విలీనాన్ని రద్దు చేయాలని అధికారులను, జిల్లా కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. ఈ నిరసనలో చేనేత కార్మికులు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.