కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడు గ్రామానికి చెందిన పి. మేడికొండ ఉసేనమ్మ తన వైద్య ఖర్చులకు డబ్బులు లేక, పెన్షన్ కూడా అందక ఇబ్బందులు పడుతున్నట్లు ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రిలో
వైసీపీ నేత వై. ప్రదీప్ రెడ్డికి తెలిపారు. ఆమె పరిస్థితిని తెలుసుకున్న ప్రదీప్ రెడ్డి తక్షణ సహాయంగా రూ.3,000 నగదును అందజేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఉసేనమ్మ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.