ఎమ్మిగనూరులో బొందిమడుగుల గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ నేత రమేష్‌ను ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్య చేసిన ఘటనపై శనివారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ హత్యను నాయకులు తీవ్రంగా ఖండించారు. నిందితులపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన శిక్షలు విధించాలని జిల్లా నాయకుడు జయరాజు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, సీబీసీఐడీతో విచారణ జరిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.