ఎమ్మిగనూరు: చేనేతల సమస్యలకు బుట్టా కుటుంబం అండగా ఉంటుంది

318చూసినవారు
ఎమ్మిగనూరు: చేనేతల సమస్యలకు బుట్టా కుటుంబం అండగా ఉంటుంది
ఎమ్మిగనూరులోని పద్మశాలి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేనేతల మహాసభ ఆదివారం జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్టా శివనీలకంఠ, చేనేతల సమస్యలకు తమ కుటుంబం అండగా ఉంటుందని, ఉపాధి, ఆర్థిక భరోసా కోసం కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. వైహెచ్ఎల్ యాప్ ద్వారా చేనేత వస్త్రాలకు న్యాయమైన ధరలు కల్పిస్తామని, ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్