ఎమ్మిగనూరు: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్

570చూసినవారు
ఎమ్మిగనూరు: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్
దళితులు క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత ఎస్సీ హోదా రద్దు చేయాలనే సుప్రీంకోర్టు తాజా తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని దళిత సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. గురువారం ఎమ్మిగనూరులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు యస్. దేవ సహాయం, డా. బి. ఆర్. అంబేద్కర్ భవన సాధన కమిటీ చైర్మన్ కదిరికోట ఆదెన్న, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి జి. ఆనంద్ చైతన్య మాదిగ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని తీర్పుపై పునఃసమీక్ష చేపట్టి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. మతం, కులం ఆధారంగా వివక్ష చూపరాదని రాజ్యాంగం స్పష్టం చేస్తోందని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్