ఎమ్మిగనూరు: ఏప్రిల్ 14న వేలాది మందితో భారీ ఊరేగింపు

217చూసినవారు
ఎమ్మిగనూరు: ఏప్రిల్ 14న వేలాది మందితో భారీ ఊరేగింపు
రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను ఏప్రిల్ 14న ఎమ్మిగనూరు పట్టణంలో ఘనంగా నిర్వహించాలని జయంతి ఉత్సవ కమిటీ నిర్ణయించింది. సోమవారం కెవిపిఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో, గత 15 ఏళ్లుగా పార్టీలకు అతీతంగా అంబేద్కర్ జయంతిని నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా దళిత, గిరిజనుల ఐక్యతను ప్రతిబింబించేలా వందల డప్పుల మోతతో, వేలాది మంది పాల్గొనేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్