ఎమ్మిగనూరు: ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా

1947చూసినవారు
ఎమ్మిగనూరు వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీని ఆప్కోలో విలీనం చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఖండించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, ఈ విలీనం అబద్ధమని, మార్కెటింగ్ మర్జర్‌ను విలీనంగా వైకాపా తప్పుగా ప్రచారం చేస్తోందని ఆరోపించారు. సొసైటీని ఆప్కోలో విలీనం చేయాలని తాను ప్రతిపాదించినట్లు ఆధారాలుంటే బుట్టా రేణుకమ్మ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తనపై ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని, లేదంటే రేణుకమ్మ వైదొలగుతారా అని సవాల్ విసిరారు.

సంబంధిత పోస్ట్