రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న టిడ్కో గృహాల పంపిణీలో భాగంగా, సోమవారం ఎమ్మిగనూరు పట్టణంలోని శివన్న నగర్‌లో 1008 మంది లబ్ధిదారులకు గృహాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బి. వి. జయనాగేశ్వర రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. వారు పైలాన్ ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసి, లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇంటి నిర్మాణం చేసుకున్న వారికి సంబంధించిన పత్రాలు, అలాగే టిడ్కో లబ్ధిదారులకు మెగా తాళాలను పంపిణీ చేశారు.