హైదరాబాద్ నగరంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద జరిగిన ఉద్రిక్త ఘటనపై సమతా సైనిక్ దళ్ తీవ్రంగా స్పందించింది. ఎమ్మిగనూరులో బుధవారం మాట్లాడుతూ, ఏబీఎస్ కార్యాలయంపై దాడికి యత్నించడం అప్రజాస్వామిక చర్య అని సంస్థ నాయకుడు రంగయ్య ఖండించారు. ఏదైనా సమస్య ఉంటే చట్టపరమైన మార్గంలో పరిష్కరించుకోవాల్సింది పోయి, రౌడీ మూకలతో మీడియా సంస్థలపై దాడులకు దిగడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. మీడియా స్వేచ్ఛపై దాడి చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఈ ఘటనపై సమతా సైనిక్ దళ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.