ఎమ్మిగనూరు: అపరిచిత లింక్‌లకు దూరంగా ఉండండి: డీఎస్పీ

877చూసినవారు
ఎమ్మిగనూరు: అపరిచిత లింక్‌లకు దూరంగా ఉండండి: డీఎస్పీ
ఎమ్మిగనూరు సబ్‌డివిజన్ డీఎస్పీ భార్గవి మంగళవారం శ్రీమహాయోగి లక్ష్మమ్మ డిగ్రీ కాలేజ్ వార్షికోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లు, లింక్‌లను నమ్మవద్దని, మొబైల్ ఫోన్, సోషల్ మీడియాను అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించి చదువుపై దృష్టి సారించాలని ఆమె విద్యార్థులకు సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి, భవిష్యత్తు లక్ష్యాల సాధనపై కృషి చేయాలని, మహిళా విద్యార్థుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్