ఎమ్మిగనూరు: ఇది ప్రభుత్వం కాదు.. ఇది గుండాల రాజ్యం

550చూసినవారు
ఎమ్మిగనూరు: ఇది ప్రభుత్వం కాదు.. ఇది గుండాల రాజ్యం
ఎమ్మిగనూరులో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే ఎర్రకోట రాజీవ్ రెడ్డి నేతృత్వంలో నిరసన ధర్నా జరిగింది. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, ఇది ప్రభుత్వం కాదని, గుండాల రాజ్యమని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి నేతల దాడి, అక్రమ అరెస్టులను ఖండించారు. ప్రభుత్వం చట్టాన్ని పాటించకపోవడం ప్రజాస్వామ్యానికి ముప్పని, అంబటిని విడుదల చేసి, దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్