కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో, రూఫ్‌టాప్ ప్రాంతాలు, సీఎం కాన్వాయ్ మార్గాలు, హెలిప్యాడ్, సభా ప్రాంగణంలో మఫ్టీ పోలీసులు, స్పెషల్ పార్టీ, బాంబ్ స్క్వాడ్‌లతో అప్రమత్తంగా బందోబస్తు నిర్వహించాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం ఆదేశించారు. ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, సీఎం పర్యటన మార్గాల్లో పూర్తి అప్రమత్తత అవసరమని ఆయన సూచించారు. అనంతరం హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్‌ను పరిశీలించారు.