కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని గాజులదిన్నె గ్రామం విషజ్వరంతో నిండుకుంది. ఎక్కడ చుసిన చిన్న పిల్లలకు , వృద్దులకు, విష జ్వరాలు తాండవం చేస్తున్నాయి. పరిశుభ్రత లోపించడం వల్లనే ఇన్ని రోగాలు వస్తున్నాయి అంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామా పంచాయితి అధికారుల కళ్ళ ముందే చెత్తతో నిండుకున్న మురికి కాలువలను చూసి కూడా చూడనట్టు వేలిపోతున్నారు అని గ్రామస్తులు తెలియజేశారు. ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవడం లేదు అని పంచాయితిలో బడ్జెట్ లేదు అని చేతులు ఎత్తేస్తున్నారని తెలిపారు.