ఎమ్మిగనూరు పట్టణంలో బంగారు, వెండి వ్యాపారులు మంగళవారం తమ దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు. బంగారు, వెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు, ఆన్‌లైన్ ధరలు, మధ్యవర్తుల ధరల మధ్య వ్యత్యాసం వల్ల నష్టాలు ఎదురవుతున్నాయని, అలాగే పాత ధరలకు కొనుగోలు చేసిన వినియోగదారులు అదే ధరకు తిరిగి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 19 నుంచి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కానుండటంతో వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దుకాణాల బంద్‌పై సాయంత్రం యూనియన్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.