గోనెగండ్ల: జీడీపీ ఎడమ కాలువకు ఏప్రిల్ 6 వరకు నీరు విడుదల

224చూసినవారు
గోనెగండ్ల: జీడీపీ ఎడమ కాలువకు ఏప్రిల్ 6 వరకు నీరు విడుదల
గోనెగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ) పరిధిలోని ఎడమ కాలువ ద్వారా ఆయకట్టు పంటలకు నీటి విడుదలను ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. మొదట మార్చి 31న నీటి సరఫరా నిలిపివేయాలని ఆదేశాలున్నా, అనివార్య కారణాల వల్ల ఎడమ కాలువకు నీటి విడుదలను మరో వారం పొడిగించారు. ప్రస్తుతం రోజుకు 40 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. ఈ కాలువ కింద 3000 ఎకరాలు సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు 1600 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.

సంబంధిత పోస్ట్