గోనెగండ్ల మండలం పిల్లిగుండ్ల గ్రామంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్.డి.టి.) ఆధ్వర్యంలో నిర్మించబోతున్న 15 ఇళ్లకు సంబంధించి బుధవారం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.డి. సరస్వతి మాట్లాడుతూ, విసెంట్ ఫెర్రర్ పేదల అభివృద్ధి ధ్యేయంగా ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గోనెగండ్ల ఎంపీడీఓ మణి మంజరి, డీటీ రఘువీర్, సీఐ చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ఎంపీడీఓ శేశికళ, గ్రామస్థులు పాల్గొన్నారు.