అక్రమ బెల్ట్ షాపులు మూసివేయాలి

3665చూసినవారు
అక్రమ బెల్ట్ షాపులు మూసివేయాలి
ఎమ్మిగనూరు పట్టణంలో కొనసాగుతున్న అక్రమ బెల్ట్‌ షాపులను వెంటనే మూసివేసి, నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పీవైఎల్‌ జిల్లా నాయకులు ఎస్. మునెప్ప డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎక్సైజ్‌ సీఐ రమేష్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సొగనూరు రోడ్డు, గూడూరు బైపాస్‌, ఎద్దుల మార్కెట్‌, పెద్దబావి తదితర ప్రాంతాల్లో అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్