కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇండియన్ జర్నలిస్టు యూనియన్ పిలుపు మేరకు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు (ఎపియుడబ్ల్యుజే) ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డా. బి.వి. నాగేశ్వర రెడ్డికి 12 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మిగనూరు తాలూకా ఎపియుడబ్ల్యుజే అధ్యక్షుడు బి. శ్రీనివాస నాయుడు, ప్రధాన కార్యదర్శి చిన్నఆకుల నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు బాష కోటేకల్ గ్రామంలో ఎమ్మెల్యేను కలిసి ఈ వినతిపత్రాన్ని సమర్పించారు.