కలుగొట్ల: సీఎం పర్యటనకు నాలుగు జిల్లాల పోలీసులతో బందోబస్తు

1453చూసినవారు
కలుగొట్ల: సీఎం పర్యటనకు నాలుగు జిల్లాల పోలీసులతో బందోబస్తు
ఈనెల 6న కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో ముఖ్యమంత్రి పాల్గొననున్న పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల నుంచి దాదాపు 1,200 మంది పోలీసులను విధుల్లోకి దింపుతున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం తెలిపారు. ముగ్గురు అడిషనల్ ఎస్పీలు, 8 డీఎస్పీలు, 55 సీఐలు, 88 ఎస్ఐలు, 297 ఏఎస్ఐలు, 485 కానిస్టేబుళ్లు, మహిళా పోలీసులు, హోంగార్డులు, ఏఆర్ సెక్షన్లు, స్పెషల్ పార్టీ బృందాలు బందోబస్తు విధులు నిర్వహిస్తాయని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్