కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి: సిపిఐ, రైతు సంఘం

3028చూసినవారు
కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి: సిపిఐ, రైతు సంఘం
ఖరీఫ్‌లో వర్షాభావం వల్ల ఎండిపోయిన పంటలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, కర్నూలు జిల్లాను తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని సిపిఐ, రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పెద్దమరివీడు, చిన్నమరివీడు, కులుమాల, పెద్దనాటూరు సచివాలయాల ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రాలు అందజేశారు.
ఎకరాకు రూ. 50, 000 పంట నష్టపరిహారం చెల్లించాలని, పంటల బీమా పరిహారం తక్షణమే మంజూరు చేయాలని, రూ. 2 లక్షల వరకు పంట రుణాలు పూర్తిగా రద్దు చేయాలన్నారు. పశువులకు ఉచితంగా పశుగ్రాసం అందించాలని, ఉపాధి హామీ కూలీలను రూ. 700లకు పెంచి, వలసలు నివారించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్