కర్నూలు: ప్రతి రైతుకు విశిష్ట సంఖ్య తప్పనిసరి

375చూసినవారు
కర్నూలు: ప్రతి రైతుకు విశిష్ట సంఖ్య తప్పనిసరి
కర్నూలు జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలంటే రైతులకు ఫార్మర్ ఐడీ (రైతు విశిష్ట సంఖ్య) తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి గురువారం సూచించారు. జిల్లాలో మొత్తం 3,27,465 మంది రైతులకు గాను, ఇప్పటివరకు 2,66,085 మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. ఇంకా 61,474 మంది రైతులు నమోదు చేసుకోవాల్సి ఉంది. రిజిస్టర్ కాని రైతులు వెంటనే రైతు సేవా కేంద్రాలను సందర్శించి నమోదు చేసుకోవాలని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్