కర్నూలు జిల్లా పోలీస్ విభాగం 'ఆపరేషన్ వజ్రప్రహార్'లో భాగంగా శనివారం మెగా కార్డన్, సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా, ఈగల్ ఐజీ ఆకే రవి కృష్ణ, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో 196 మంది పోలీసులు 350 మందిని, 77 వాహనాలను, 50 అనుమానితుల ఇళ్లను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 52 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మంత్రాలయం పరిధిలో 41 లిక్కర్ బాటిళ్లను సీజ్ చేశారు. జిల్లాలో మాదకద్రవ్యాల ప్రమాదాలపై అవగాహన కల్పించడం కూడా ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమని తెలిపారు.