నందవరం మండలంలో ఓవర్ లోడ్ తో ఆటోలను నడిపితే వాహనాలు సీజ్ చేసి భారీ జరిమానాలు విధిస్తామని ఎస్సై తిమ్మారెడ్డి హెచ్చరించారు. శనివారం స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహించి 7 ఓవర్ లోడ్డ్ ఆటోలను సీజ్ చేశారు. కూలీల డిమాండ్ పెరగడంతో ఆటోల్లో ఎక్కువ మంది తరలిస్తున్నారని, ఇది ప్రమాదాలకు దారితీస్తుందని, రోడ్డు భద్రత కోసం తనిఖీలు కొనసాగిస్తామని ఆయన తెలిపారు.